- Advertisement -
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభం కార్యక్రమం వాయిదా వేసినట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం వల్ల ప్రారంభ కార్యక్రమానికి వచ్చే మహిళలు, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని మేయర్ తెలిపారు.
- Advertisement -