- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అతి త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లను పెంచుతామని, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు దివ్యాంగుల పెన్షన్లను రూ.4,016 నుంచి రూ.6వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.
- Advertisement -



