నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
42% రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో గత తొమ్మిది రోజులుగా కల్వకుర్తి పట్టణంలో వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. రాబోయే రోజులలో మండల బీసీ జేఏసీ కమిటీలు, గ్రామ కమిటీలు వేసి గ్రామ గ్రామాన రిజర్వేషన్ల ఆవశ్యకత తెలియజేయడానికి బీసీ జన చైతన్య యాత్ర నిర్వహించడానికి ఈరోజు బిసి జేఏసీ సభ్యులందరూ కలిసి నిర్ణయించడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్ర బీసీ నాయకత్వం వెనకడుగు వేసిన కల్వకుర్తి బీసీ జేఏసీ కచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా జనాభాలో సగం వాటా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డు లేని 50% నిబంధన బిసి రిజర్వేషన్లకు ఎందుకని ప్రశ్నించడం జరిగింది.



