నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల అమలుకు కృషి
– అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్..
నవతెలంగాణ – బంజారాహిల్స్
హర్ ఘర్ నినాదంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధన కోసం యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తూ.. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ పార్టీ కార్యదర్శి జోజి రెడ్డి ప్రత్యేక మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ నాయకులు ఆర్ వి ప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు.
ఫాసిస్టు ధోరణి అవలంభిస్తున్న అమెరికాతో పాటు క్యాపిటలిస్టు దేశాల తీరును ఖండిస్తూ,కేంద్ర ప్రభుత్వం తీరును వామపక్ష పార్టీల విధానానికి మద్దతు తెలుపుతూ.. 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలన లోపాలు, ప్రజాపాలన ప్రభుత్వ విఫలత్వాన్నీ ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది సభ్యత్వాలు చేయాలన్న ధృడ సంకల్పంతో ఉన్నామని తెలియజేశారు. అమెరికా వెనిజులాపై చేసిన అప్రజా స్వామీక విధానాన్ని ఖండిస్తూ, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ తౌపిక్ అలీ,బి,రాములు యదవ్, అందే బీరయ్య,టి,రామ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



