సీఎం రేవంత్ రెడ్డి
ఎక్స్ వేదికగా ట్వీట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ”ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం ” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో రెండేండ్ల ప్రజాపాలన, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని సీఎం చెప్పారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందనీ, ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాల్టీ, మున్సిపల్ కార్పొరేషన్లను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని తెలిపారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



