శర్వా నటించిన కొత్త చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆత్రేయపురంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ,’ ఆత్రేయపురంలోనే ‘శతమానం భవతి’ చేశాం. నేను మంచి సినిమాలు చేస్తానని నమ్మకం ఆడియన్స్‌లో వుండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది మీ అందరిని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా. అన్నిట్లోకి అద్భుతమైనది నవ్వు. ప్రతి ఇంట్లో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అందరూ కూడా మా సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ. అది మీరందరూ మాకు ఇచ్చే కానుక. ఇది చాలా క్లీన్ ఫిలిం. మంచి కథని చాలా హ్యూమరస్‌గా చెప్పడం జరిగింది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది.
మీకు కూడా నచ్చుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సినిమా టికెట్ ధరలని మేము పెంచడం లేదు. అందరికీ అందుబాటులో వున్న ధరలే వుంటాయి’ అని తెలిపారు. ‘ఇది మెమొరబుల్ జర్నీ. డైరెక్టర్ అబ్బరాజు అద్భుతమైన క్యారెక్టర్ రాశారు. నిత్య క్యారెక్టర్ చాలా స్పెషల్. శర్వాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది’ అని హీరోయిన్ సాక్షి వైద్య చెప్పారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ,’ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీ. థియేటర్లో ఫ్యామిలీతో పాటు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఈ సినిమాని కంప్లీట్ ఎంటర్టైనర్‌గా ప్యాక్ చేశారు. నాకు దియా అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. సినిమా సంక్రాంతి ఫీస్ట్‌లాగా ఉండబోతుంది’ అని అన్నారు.
అందర్నీ నవ్విస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



