Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 

ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 

- Advertisement -

దార సత్తెమ్మ బిక్షం సర్పంచ్, కురుమర్తి
నవతెలంగాణ – కట్టంగూర్
కురుమర్తి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన దార సత్తెమ్మ బిక్షం అన్నారు. సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టాక మంగళవారం నవతెలంగాణతో ఆమె మాట్లాడారు. గ్రామంలోని ప్రతి వీధిలో సిసి రోడ్డు, మురికి కాలువలు నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాగునీటిని ప్రతి ఇంటికి నిరంతరం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు సిబ్బందితో పర్యవేక్షిస్తానని చెప్పారు.

గ్రామంలో వోల్టేజ్ సమస్య లేకుండా ఏరియాల వారీగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కొరకు కురుమర్తి నుండి అక్కలాయగూడెం లింకు రోడ్డు, కురుమర్తి నుండి మునుకుంట్ల లింకు రోడ్డును మరమ్మత్తులు చేయిస్తానని చెప్పారు. కురుమర్తి నుండి పందన పల్లి కి ఉన్న లింకు రోడ్డును పునర్దరించేందుకు కృషి చేస్తానన్నారు. కట్టంగూర్ నుండి కురుమర్తి వరకు ఉన్న బీటీ రోడ్డు పనులు పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే సహకారంతో కురుమర్తి, ఆకారం, గురజాల ఆర్టీసీ  బస్సును ప్రారంభించి కాలేజీ విద్యార్థుల కు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మాణం కొరకు, పశు వైద్యశాలలో సిబ్బంది ఏర్పాటు కొరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడతానని అన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -