Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతా

గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతా

- Advertisement -

– మమదాబాద్ సర్పంచ్ సూర్నార్ శకుంతలబాలు
నవతెలంగాణ – జుక్కల్ 

మహమదాబాద్ ను గుడిసెలు లేని గ్రామంగా తీర్చి దిద్దుతానని సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు అన్నారు. గురువారం గ్రామంలో సర్పంచ్, కార్యదర్శి జీవన్ రాథోడ్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణాలను త్వరతగతిన చేపడితే వారికి వీలైనంత తొందరగా బిల్లులు అందేందుకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా గ్రామంలో శానిటేషన్ పనులు నిత్యం చేస్తూ చెత్తాచెదారం లేకుండా పనులు నిర్వహిస్తామని అన్నారు. గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, ఇందిరమ్మ గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -