Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంగోప్యతా హక్కు ఉల్లంఘనకు అనుమతించం

గోప్యతా హక్కు ఉల్లంఘనకు అనుమతించం

- Advertisement -

వాట్సాప్‌, మెటాలకు స్పష్టం చేసిన సుప్రీం
డేటా దోపిడీకి గురౌవుతుందని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :
లక్షలాదిమంది ప్రజల గోప్యతా హక్కు ఉల్లంఘించబడేం దుకు తాము అనుమతించబోమని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌, దాని మాతృ సంస్థ మెటాలు భారత్‌లోని వారి ‘నిశ్శబ్ద వినియోగదారుల’ వ్యక్తిగత డేటాను పంచుకుంటూ, వాణిజ్యపరంగా దోపిడీ చేయడానికి అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఒక దశలో చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మెటా, వాట్సాప్‌లు ప్రయివేటు డేటాను పంచుకోవడాన్ని ‘మర్యాదగా చౌర్యానికి పాల్పడడం’గా పోల్చింది. ఇప్పటికే మీరు కోట్లాది బైట్‌ల డేటాను లాగేసుకుని వుంటారని వ్యాఖ్యానించింది. కాగా కోర్టు వ్యాఖ్యలను ఆ రెండు సంస్థల తరపు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోV్‌ాతగి, అమిత్‌ సిబల్‌ తీవ్రంగా తిరస్కరించారు. తమ డేటా పంచుకోకుండా వుండేందుకు వినియోగదారులు ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చన్నారు. ముందుస్తు అనుమతి అత్యంత కీలకమని అన్నారు. ప్రయివేటుదా? కాదా? అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి సంబంధించిన డేటాకు విలువ వుంటుందని జస్టిస్‌ జోమాల్యా బగ్చి వ్యాఖ్యానించారు. 2023లో తీసుకువచ్చిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం కేవలం గోప్యతా అంశాన్ని మాత్రమే కవర్‌ చేస్తోందని, ఒక వినియోగదారుడి డేటా షేరింగ్‌పై ఎలాంటి చట్టం లేనట్టు కనిపిస్తోందన్నారు.

వినియోగదారులమే కాదు, ఉత్పత్తులం కూడా
ఒక వ్యక్తి తన డాక్టరుతో మందుల గురించి ఆన్‌లైన్‌ మాట్లాడాడనుకుందాం, కొద్ది నిముషాల తర్వాత, ఆ వ్యక్తికి అందుబాటులో వున్న వైద్య సేవలు గురించి నోటిఫికేషన్లు లేదా వాణిజ్య ప్రకటనలు వస్తాయని చీఫ్‌ జస్టిస్‌ ఒక ఉదాహరణ చెప్పారు. ఈ దశలో అక్కడే వున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ, మన ప్రవైసీ డేటా విక్రయించడమే కాదు, వాణిజ్యపరంగా కూడా దోపిడీకి గురవుతోందని వ్యాఖ్యానించారు. మనం కేవలం వినియోగదారులమే కాదు, ఉత్పత్తులం కూడా అని వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -