– రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్టీలకు అన్యాయం చేస్తే ఉపేక్షించమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కివెంకటయ్య అన్నారు. ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులు కాగితాల మీద చూపెడుతూ.. ఖర్చు నామ మాత్రంగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెచ్చించిన నిధులు ఖర్చు చేయకపోతే తరతరాలుగా వెనుకబాటుకు గురైన గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో సంబంధిత అధికారులతో గిరిజన అభివృద్ధి నిధులపై సమీక్ష నిర్వహించారు. నొడల్ ఏజెన్సీ సమావేశాలు జరుగుతున్నాయా అని అరా తీశారు. మార్చిలో జరిగిందని అధికారులు సమాధానం ఇవ్వగా, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఎందుకు పిలవడం లేదని నిలదీశారు. ”2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.15,232 కోట్లను కేటాయించగా, కేవలం రూ.10,400 కోట్లను ఖర్చు చేశారు. గిరిజన శాఖకు కేటాయించిన రూ.3,025 వేల కోట్లలో కేవలం రూ.1728 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు” అని వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అన్యాయం చేస్తే ఊరు కోమని హెచ్చరించారు. ఇంజినీరింగ్ శాఖ, గురుకులాలు, హస్టళ్ళు, అటవి హక్కుల చట్టం, ట్రైకార్, జీసీసీ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మినారాయణ, రేణికుంట ప్రవీణ్, జిల్లా శంకర్, గిరిజిన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి అలగు వర్షిణి, కమిషనర్ సీతాలక్షి ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
ఎస్టీలకు అన్యాయం చేస్తే ఉపేక్షించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES