దుర్కి మిర్జాపూర్ రోడ్డుకు 25 కోట్లు
బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధ్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ తెలిపారు. బుదవారం దుర్కి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దుర్కి మిర్జాపూర్, బీర్కూర్ మండల ప్రజల రవాహణ సౌకర్యం మెరుగు పరచడం ఎమ్మెల్యే పోచారం ఎనలేని కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గతంలో 11 కోట్లు నిధులు మంజూరు కాగా పని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం సమయంలో ఎన్నిక కోడ్, రావడంతో పనులు జాప్యం జరిగింది.
అంతలో వలస వచ్చిన నేత ముడుపులు రాక పోవడంతో టెండర్ ను రద్దు చేయించాడు. అయినా ఎమ్మెల్యే పోచారం మళ్ళీ దుర్కి, మిర్జాపూర్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహకారంతో దుర్కి మిర్జాపూర్ బీర్కూర్ ప్రధాన రహదారి కోసం 24 కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కొందరు తప్పుడు ఆరోపణ చేస్తూ తపం కట్టుకుంటున్నారని అని అన్నారు. ఉమ్మడి బీర్పూర్ మండలం అభివృద్ధికి అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దుర్కి మిర్జాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ పటేల్ , ఎండి యూనుస్, , అరవింద్ , కిషన్ గౌడ్ సచిన్ తదితరులు పాల్గొన్నారు.



