Sunday, July 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం..

ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ, అహర్నిశలు ప్రజాసేవ గిరిజన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పై  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే ఊరుకోబోమని ఆదివాసీ గిరిజన సంఘం జన్నారం మండల అధ్యక్షుడు  రాయి సిండ్డం కాళీ , మండల ఏఎంసీ డైరెక్టర్ సోనేరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. ఎస్.కె గ్రూప్స్ కృష్ణ, డిజిటల్ మైక్రో ఫైనల్స్ కు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పై  బిఆర్ఎస్, బిజెపి  నాయకులు బురద చల్లాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్  జిల్లా ఉపాధ్యక్షులు హడాయి హనుమంతరావు, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు కురుమేత ధర్మ పటేల్, తుడుం దెబ్బ జిల్లా నాయకులు మరస కోల వసంత్ గంగు పటేల్ పరిశాక జైతు తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -