– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తానంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ నీళ్ల కోసమైతే కేసీఆర్ పోరాటం చేశారో ఆ నీళ్లను రేవంత్ రెడ్డికి ఏపీకి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఫోన్ కాల్‌తో భయపడి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ నీళ్లను తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటుపై పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారో లేక ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని చర్చించి తేల్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బనకచర్లపై పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేయకుండా గోదావరి జలాలను కిందకు వదిలే కుట్రను రేవంత్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, బీఆర్‌ఎస్ నేతలు ఒంటెద్దు నరసింహ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES