పార్టీలపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలను ఒప్పుకోం : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ బంద్‌లో పాల్గొనేందుకు తెలంగాణ భవన్ నుంచే తరలి వెళతామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. క్యాబినెట్‌లో పార్టీలపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. కులగణన సరిగ్గా చేయలేదనీ, సర్వే పత్రంపై సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టడం, గవర్నర్ కు అసెంబ్లీ తీర్మానం వెళ్లకముందే ఢిల్లీలో ధర్నా, ఆ ధర్నాకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరు కాకుండా కాంగ్రెస్ డ్రామాలు చేసిందని విమర్శించారు.
చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. బంద్‌లో ప్రతి బీసీ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ వెంటపడతామని హెచ్చరించారు. చట్టం లేకుండా ఏ జడ్జి అయినా తీర్పు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 18న బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు.
18న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES