Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరజక, క్షౌరవృత్తిదారుల ఉచిత కరెంటు బిల్లులు చెల్లిస్తాం

రజక, క్షౌరవృత్తిదారుల ఉచిత కరెంటు బిల్లులు చెల్లిస్తాం

- Advertisement -

– రజక వృత్తిదారుల సంఘానికి ఉపముఖ్యమంత్రి భట్టి హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని రజక క్షౌర వృత్తిదారుల ఉచిత కరెంటుకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రజక వృత్తిదారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్యతో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. రజక, నాయీబ్రాహ్మణులకు 25 ఉచిత విద్యుత్‌ పథకం బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో మోడ్రన్‌ దోబీఘాట్లు మంజూరయ్యాయనీ, తిరిగి వాటి నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత విద్యుత్‌ పథకం అమలు కానీ లబ్దిదారులు చాలా మంది ఉన్నారని తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదాల బారిన పడుతున్న వృత్తిదారులకు రూ.ఐదు లక్షల బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టు ఆశయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -