Tuesday, September 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గుడిల ముందు జమ్మిచెట్లు నాటుతాం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గుడిల ముందు జమ్మిచెట్లు నాటుతాం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం అన్ని గ్రామాల్లో గుల్ల ముందు జమ్మి చెట్లు నాడుతామని హరిత సేవ సమితి సభ్యుడు నరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం  జన్నారం మండలం లోనీ రామాలయంలో జమ్మి చెట్టుకు పూజలు చేసి  ఆలయం ముందు జమ్మి చెట్టును నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా  జన్నారం మండలం రామ లయ ఆవరణలో జమ్మి మొక్క నాటడం జరిగిందన్నారు.

 పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రతి దసరాకు జమ్మి మొక్క నాటే కార్యక్రమం చేపట్టి తన వంతుగా కృషి చేస్తున్నారన్నారు. అందుకు మాజీ ఎంపీ   సంతోష్ కుమార్ వైస్ ప్రసిడెంట్ రాఘవేందర్ యాదవ్ కి ఖానాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్  నాయకులు పూర్ణ చందర్ నాయక్ కి  మండల ప్రజల  తరుపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరిత సేవా సభ్యులు కాసెట్టి లక్ష్మణ్, బిఆర్ఎస్ పార్టీ శెట్టిపల్లి సత్యం మున్వర్ అలీ ఖాన్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ పురుషోత్తం మగ్గిడి ప్రణవ్ కుమార్,  మూల భాస్కర్ గౌడ్ రాజన్న వాసాల శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -