గ్రెటా థన్‌బెర్గ్ వ్యాఖ్యలు
గాజా దిశగా పయనిస్తున్న ఎయిడ్ ఫ్లోటిల్లా బృందం
ఏథెన్స్ : ఇజ్రాయిల్ ఆంక్షలు, దాడులతో అతలాకుతలమవుతున్న గాజా ప్రజానీకానికి మానవతా సాయం అందించే లక్ష్యంతో బయలుదేరిన అంతర్జాతీయ బృందం గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా శుక్రవారం గ్రీస్ నుంచి గాజా దిశగా ప్రయాణాన్ని ఆరంభించింది. మరోపక్క ఎలాగైనా ఆ బోట్లను గాజా చేరనిచ్చేది లేదంటూ ఇజ్రాయిల్ పదే పదే హెచ్చరిస్తోంది. అయినా వాటిని లక్ష్య పెట్టకుండా ఈ నౌకల బృందం తన ప్రయాణాన్ని సాగిస్తోంది. స్వీడిష్ వాతావరణ, సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సహా పలువురు సామాజిక, మానవ హక్కుల కార్యకర్తలు ఈ బోట్లలో ప్రయాణిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గాజా ప్రజలకు సంఘీభావం తెలియచేస్తూ, వారిలో ఆశలను సజీవంగా వుంచేందుకు తమ ఈ పర్యటన ఉద్దేశించబడిందని చెప్పారు. ఈ బోట్లలో అనేకమంది లాయర్లు, పార్లమెంటేరియన్లు కూడా వున్నారు. ఈ వారం ప్రారంభంలో డ్రోన్ల దాడులుజరగడంతో కొంత ఆందోళన నెలకొంది.
పైగా మధ్యధరా సముద్రంలో సాగుతున్న ఈ ప్రయాణంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటలీ, స్పెయిన్‌లు ఆ బృందానికి సాయంగా తమ నౌకలను పంపించాయి. వచ్చే వారం ప్రారంభంలో బోట్లు గాజా చేరుకుంటాయని భావిస్తున్నారు. గాజాకు సాయం చేరనివ్వమని ఇజ్రాయిల్ తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఈ సాయాన్ని జెరూసలేంలోని క్యాథలిక్ చర్చికి అందచేస్తామని, అక్కడ నుంచి వారు గాజాకు పంపుకోవాలని ఇటలీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యమేనని ఇజ్రాయిల్ తెలిపింది. కానీ గాజా ఎయిడ్ ఫ్లోటిల్లా మాత్రం దీన్ని తిరస్కరించింది. ‘కేవలం మానవతా సాయాన్ని అందించడమొక్కటే లక్ష్యం కాదని, వారికి ఆశ, సంఘీభావాలను కూడా అందచేయాలని ప్రయత్నిస్తున్నామని గ్రెటా థన్‌బెర్గ్ వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచం పాలస్తీనా వైపు నిలబడిందని ఆమె స్పష్టం చేశారు.
ఆశను.. సంఘీభావాన్ని అందిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES