Sunday, September 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజిల్లాల్లో కోర్టులకు మౌలిక వసతులు కల్పిస్తాం

జిల్లాల్లో కోర్టులకు మౌలిక వసతులు కల్పిస్తాం

- Advertisement -

సిబ్బంది నియామకాలు చేపడతాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌తో సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అన్నారు. సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగాఉందన్నారు. రాష్ట్రం లో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థా నాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతోపాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదన లను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై సీఎం రేవంత్‌రెడ్డి పై విధంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సామ్‌ కోశి, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ శావిలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు, అడ్వకేట్‌ జనరల్‌ ఎ సుదర్శన్‌ రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -