స్వాతంత్ర దినోత్సవంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం గడువు మరో ఆరు నెలలు పొడగింపుతో రైతులకు మరిన్ని సేవలందిస్తూ, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య తెలిపారు.79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడిచర్ల పిఏసిఎస్ కార్యాలయం ఆవరణలో మూడు రంగుల మవెన్నెలా జెండాను ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు నోట్ బుక్స్,పెన్నులు, స్వీట్స్ పంచారు. గడువు పెంచినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, మాచర్ల సురేష్, సంగ్గేం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
గడువు పొడగింపుతో రైతులకు మరిన్ని సేవలందిస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES