రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి లోని ఎస్ ఎస్ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్, కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తంగళ్లపల్లి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా పేదలకు రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1397 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి అందిస్తున్నామని వెల్లడించారు.
ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అన్నారు.ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కే కే మహేందర్ రెడ్డి మాట్లాడారు.ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొకటి అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణ మాఫీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి కింద క్యాంటీన్లు, మిల్క్ పార్లర్, ఆర్ టీ సీ బస్సులు, పెట్రోల్ బంక్, ఫెర్టిలైజర్ దుకాణాలు ఇతర స్వయం ఉపాధి యూనిట్లు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందన్నారు.కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డి డబ్ల్యు ఓ లక్ష్మీరాజ్యం తహసిల్దార్ జయంత్ , వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES