Thursday, February 5, 2026
E-PAPER
Homeఖమ్మంపట్టణ పేదలకు నీడ కల్పిస్తాం: మంత్రి పొంగులేటి 

పట్టణ పేదలకు నీడ కల్పిస్తాం: మంత్రి పొంగులేటి 

- Advertisement -

– సీపీఐ( ఎం) అభ్యర్థిని గెలిపిస్తాం
– పట్టణ పేదలకు ఉపాధి కల్పించండి – సీపీఐ ( ఎం) నాయకులు పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు ఇంటి స్థలం ఇచ్చి వారికి నీడ కల్పిస్తాం అని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు జారె ఆదినారాయణ నేతృత్వంలో, పిసిసి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో గురువారం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.

మున్సిపాలిటీ ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించారు. సీపీఐ(ఎం ) బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అశ్వారావుపేట మున్సిపాలిటీ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని,రహదారులు తాగునీరు పారిశుద్ధ్యం పేదలకు ఇళ్ల నిర్మాణం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పనిచేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ( ఎం)అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ కావడంతో ఈ పట్టణంలో ఉన్న వేలాది మంది కూలీలు ఉపాధి అవకాశాలు కోల్పోయారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీ ఎన్నికల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాల్గొన్న పుల్లయ్య మాట్లాడుతూ.. పట్టణ పేదలకు ఉపాధి హామీ బదులుగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునః ప్రారంభం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, 22 వార్డులో అభ్యర్ధుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -