- Advertisement -
నవతెలంగాణ – కడ్తాల్
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తల్ ఎంబీఏ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి–షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్‌పర్సన్ యాట గీత నరసింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్త తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



