Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తాము..

ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తాము..

- Advertisement -

ఇన్చార్జి తాహసిల్దార్ హేమలత ..
నవతెలంగాణ – జుక్కల్ 
: ప్రతివారానికి ఒకసారి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని జుక్కల్ ఇంచార్జ్ తహసిల్దార్ హేమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవోతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన సమస్యలను పరిశీలించి ఎక్కడికక్కడే పరిష్కారిస్తామన్నారు. మా పరిధిలో లేని విషయాలను జిల్లా అధికారులకు సమాచారం అందిస్తామని ఆమె అన్నారు. అదేవిధంగా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -