Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తాం

పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

– ఆ బాధ్యత నాదే.. : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కారిస్తాం… ఆ బాధ్యత తనదేనని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల, ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందనీ, అందుకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. టీం వర్క్‌తో, సమన్వయంతో పనిచేయాలని, గ్యాప్‌లకు తావివ్వకూడదని చెప్పారు. అన్ని వెల్ఫేర్‌ సొసైటీలు, శాఖలు ఒక సమగ్ర విధానాన్ని సిిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, బోధన, వసతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థులకు వసతి, ఆహారం, వైద్య సదుపాయాల్లో నాణ్యత కాపాడాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి అధికారి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురుకులాలతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మంత్రి సూచించారు. బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతర్జాతీయ స్థాయి నాణ్యతను సాధించాలన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మైనార్టీ వెల్ఫేర్‌ ఉద్యోగుల జీతాల విషయంలో సాంకేతిక సమస్య వచ్చిందని చెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు జీవో విడుదల చేసి, వారికి జీతాలిచ్చామని గుర్తు చేశారు. ఫైనాన్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారుల తప్పిదం వల్ల సాంకేతిక సమస్య వచ్చిందని తెలిపారు. నా పరిధిలో ఉన్న శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత నాపైనే ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల పదోన్న తులు ఇతర అంశాల పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రమోషన్‌ పాలసీ అమలు చేస్తామన్నారు. సోమవారం లేదా మంగళవారం ఉద్యోగులకు జీతాలు అందుతాయని తెలిపారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వుంటుం దన్నారు. టీమ్రిస్‌ ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి అసలే లేదని చెప్పారు. మొత్తం 24 క్యాడర్లలో 18 క్యాడర్ల ఉద్యోగుల వేతనాలు యధాతధంగా కొనసాగ ుతున్నాయని తెలిపారు. జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీ,టీజీటీ, స్టాఫ్‌ నర్స్‌, ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు, మ్యూజిక్‌, ఆర్ట్‌ టీచర్ల వేతనాల విషయంలో తప్పుడు లెక్కింపు జరిగింద న్నారు. వీరిని పొరపాటున పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా పరిగ ణించడం వల్ల గందరగోళం నెలకున్నదని తెలిపారు. వాస్తవానికి ఈ ఉద్యోగులు ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:30 వరకు రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. 2023-24, 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వేతనాల జీవోలు జారీ చేసిందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొత్త జీవో విడుదల చేసి ఉద్యోగుల వేతనాలపై పూర్తి స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -