నవతెలంగాణ – పెద్దవూర
ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులు ఎక్కడ కనిపించినా అక్కడే సీజ్ చేస్తామని మండల విద్యాధికారి తరి రాము హెచ్చరించారు. శుక్రవార మండల పరిధిలోనిడివైన్ మిర్సీ,మాంటిసోరీ,శాంతినీకేతన్ పాఠాశాలస్కూల్స్‌లో స్కూల్ బస్సులను పరిశీలించారు. ఈసందర్బంగా ఎంఈఓ తరిరాము మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక స్కూల్ బస్సు రోడ్ ఎక్కాలంటే తప్పనిసరిగా 32 నిబంధనలు పాటించాలి అని అన్నారు. అందులో ప్రధానమైంది ఫిట్నెస్, టైర్లు, బ్రేక్ తదితర సాంకేతిక సామర్థ్యం పట్ల సంతృప్తి చెందితేనే సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని తెలిపారు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఫైర్,ఎస్టింగ్విషర్ బస్సు ఇంజన్,కంపార్ట్మెంట్లో కచ్చితంగా ఉండాలి అని అన్నారు.
బస్సు పైన స్కూల్ పేరు మరియు ఫోన్ నెంబరు తప్పనిసరిగా రాయాలని, బస్సు తలుపులకు లాక్ సిస్టం పెట్టాలి అని అన్నారు. స్కూల్ పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా బస్సు కిటికీలకు గ్రిల్స్ అమర్చాలని తెలిపారు. ప్రవేశద్వారం, అత్యవసర ద్వారాలకు తలుపులు కచ్చితంగా ఉండాలని అన్నారు. బస్సు డ్రైవర్ తప్పనిసరిగా పాఠశాల బస్సులో తీసుకెళ్లే పిల్లల పూర్తి జాబితాను కలిగి ఉండాలి. పేరు, తరగతి, నివాస చిరునామా వంటివి తెలిసి ఉండాలన్నారు. బస్సు డ్రైవర్‌కు హెవీ మోటార్ లైసెన్స్, బ్యాడ్జ్ లైసెన్స్‌తో పాటు భారీ వాహనాలు నడపడంలో కనీసం ఐదు సంవత్సరాల సీనియారిటీ తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. ఫిట్నెస్ లేని బడి బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ మండలాల వారీగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళే ఆటోలు, ఇతర వాహనాల పైన కూడా నిఘా ఉంటుందని వివరించారు. వాహన డ్రైవర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మద్యం తాగకుండా ప్రతిరోజు పరీక్షించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం సూ సుకోవాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులను బస్సు ఎక్కించడానికి సహాయకులనునియమించి నట్లు తెలిపారు. పై నియమాలు పాటించని ఎడల క్రిమినల్ కేసులు పెట్టవలసి ఉంటుందని మండల విద్యాధికారి తెలిపారు.
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES