Saturday, October 25, 2025
E-PAPER
Homeకరీంనగర్ఐకెపి కేంద్రానికే వడ్లను విక్రయిస్తాం..

ఐకెపి కేంద్రానికే వడ్లను విక్రయిస్తాం..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
మేము పండించిన పంటను ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోని విక్రయిస్తామని రైతులు పేర్కొన్నారు. మండలంలోని మండేపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ ద్వారా నిర్వహించడం తో మేము వడ్లను విక్రయించమని రైతులు తెగేసి చెప్పారు. గతంలో పలుమార్లు ఫ్యాక్స్ ద్వారా విక్రయించిన రైతులకు నష్టం వాటిల్లింది తప్ప ఏ ఒక్క రైతుకు లాభం చేకూరలేదని వాపోయారు. గత సంవత్సరం ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా లాభసాటిగానే జరిగిందని వివరించారు.

ఇప్పుడు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్యాక్స్ ధారణ నిర్వహిస్తే మేము వడ్లను విక్రయించలేమని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఫ్యాక్స్కు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకొని మహిళా సంఘం ద్వారా నిర్వహించే ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఎస్సై ఉపేంద్ర చారి, సిరిసిల్ల ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫ్యాక్స్ ద్వారా వడ్ల కొలుమూల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైర్మన్ తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -