కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీలో తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని సగౌరవంగా గాంధీభవన్‌కు తరలిస్తామని తెలిపారు. శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టిస్తామని తెలిపారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కానే కాదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని కవిత ఖండించారు. ఈ అరెస్ట్ అక్రమమని అన్నారు. అరెస్ట్ చేసిన విశారదన్ మహరాజ్‌ను పలు స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ కవి, అధ్యాపకులు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం పట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆయనకు ఈ అవార్డు రావటం తెలంగాణకే గర్వకారణమని అభినందనలు తెలిపారు. ఆయన కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని ఆకాంక్షించారు.
ఆ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



