కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రులు జూపల్లి, పొన్నం
ఈ వేడుకలో 18 దేశాల నుంచి 40 మందికిపైగా అంతర్జాతీయ కైట్ ప్లైయర్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో రంగురంగుల పతంగులు, నోరూరించే మిఠాయిలతో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2026ను మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈమేరకు ఫ్రాన్స్ దేశానికి షార్క్ ఆకారంలోని కైట్‌ను మంత్రి జూపల్లి ఎగురవేసి సందడి చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా సహా సుమారు 18దేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ కైట్ ప్లైయర్లు పాల్గొంటున్నారు. వారితోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి 55 మంది ప్రొఫెషనల్ ప్లైయర్లు తమ విన్యాసా లను ప్రదర్శిస్తున్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పతంగుల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పారు. మన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణ కోసమే ప్రభుత్వం ఈతరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి తరలివచ్చి ఎగురవేస్తున్న రంగురంగుల పతంగులు ఆకాశాన్ని మురిపిస్తున్నా యంటూ హర్షం వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో పతంగులు ఎగురవేసిన మధుర జ్ఞాప కాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసు కున్నారు. తెలంగాణ సంస్కృతిని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. విదేశీ అతిథులకు మన రాష్ట్ర ఆతిథ్యం తెలిసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సందర్శకులకు ఉచితంగా ఎంట్రీ కల్పిం చామన్నారు. గాలిపటాల తయారీని హైదరా బాద్‌లోనే భారీఎత్తున ప్రోత్సహిం చడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగ అభివద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తమ తీరికలేని జీవితంలో కనీసం నెలకు రెండు రోజులైనా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని సూచిం చారు. దీంతో మానసిక ఉల్లాసంతో పాటు, స్థానిక కళాకారులు, వ్యాపారులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌ను ప్రజలంతా సందర్శించి విజయవంతం చేయాలని కోరుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మిఠాయిల స్టాళ్లను మంత్రి జూపల్లి సందర్శించి, రుచులను ఆస్వాదించారు. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ఆనందం, ఉత్సాహం అని, ఇలాంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని అన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజలంతా తమ కుటుంబాలతో కలిసి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డి, పర్యాటక అభివద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహరెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్‌రావు, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి సోలంకి, క్లిక్ సంస్థ ప్రతినిధులు లింబీ బెంజిమన్, పరమానంద శర్మ , అభిజిత్, తదితరులు పాల్గొన్నారు
1300కుపైగా స్టాళ్లు
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. సుమారు 1300కుపైగా స్టాళ్లల్లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతోపాటు పంజాబ్, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల స్వదేశీ మిఠాయిలు అందుబాటులో ఉన్నాయి. తొలిరోజు పగటిపూట రంగురంగుల గాలిపటాలతో నిండిపోయిన ఆకాశం, రాత్రి వేళలో ఎల్‌ఈడీ పతంగుల వెలుగులతో మెరిసింది.
మన సంస్కృతిని చాటిచెబుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



