Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందె రోడ్ల సమస్యలను పరిష్కారం చేస్తాం..

అందె రోడ్ల సమస్యలను పరిష్కారం చేస్తాం..

- Advertisement -

గుంతల రోడ్లను పరిశీలించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్..
నవతెలంగాణ -మిరుదొడ్డి

మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్షం నాయకులు అందరూ కలిసి మారుమూల ప్రాంతం అయిన అందే గ్రామానికి రోడ్లు వేయాలని ఇటీవల పలు శాఖల అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాగ  రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రోడ్ల ను సందర్శించారు. ఇటీవల నవతెలంగాణ వచ్చిన కథనాన్ని  చూసి డిప్యూటీ ఇంజనీరింగ్ వెంకటేశ్వర్లు మండలం మిరుదొడ్డి నుండి అందుకు వెళ్లే రోడ్డును పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట నుండి దౌల్తాబాద్ ఎక్స్ రోడ్ నుండి అందె గ్రామం వరకుగ్రామస్తులు తో కలసి నడుచుకుంటూ, గుంతలమయమైన  రోడ్డును త్వరలో పూర్తి చేస్తామన్నారు.ఈ రోడ్ల దుస్తిని చూసి త్వరలోనే పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు.

జేఏసీ నాయకులు మారుమూల ప్రాంతం గ్రామమైన  అందే గ్రామానికి గత ఇరువై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్లు తప్ప, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు వేయకపోవడం, పాత రోడ్లన్నీ  పూర్తి గుంతల మయం అవ్వడంతో, గ్రామం నుండి ప్రతిరోజు సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఉన్నత చదువుల కోసం కళాశాలకు వెళుతుంటే, సరైన సమయానికి బస్సులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని గర్భిణులు బాలింతలు వృద్ధులు హాస్పిటల్ లోకి వెళ్దామంటే, అంబులెన్స్లు రోడ్డు బాగాలేక రాకపోవడంతో, వైద్యానికి నోచుకోలేకపోతున్నారని, గ్రామంలో రైతులు పండించిన ఆకుకూరలు కూరగాయలు, అత్యధికంగా పండించినప్పటికీ రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల పండించిన కూరగాయలు, సరైన సమయానికి మార్కెట్ కు తరలించకపోవడం వల్ల, నష్టపోతున్నామని, తమ గోడును తెలియజేశారు, గ్రామస్తుల సమస్యలను పరిష్కరించి వెంటనే రోడ్డు వేయాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో, జేఏసీ కన్వీనర్ వారాల రాజు కుమార్, బుంగరి సత్తయ్య,చుక్క శంకర్,అందె ప్రవీణ్,కడారి యాదగిరి,పర్శరాములు,పోచయ్య, సంతోష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -