కన్నాయిగూడెం, పేటమాలపల్లి భూములకు పరిష్కారం…
త్వరలోనే హక్కు పత్రాలు అందిస్తాం…
కొండరెడ్లు ఆర్ధికంగా రాణించాలి…
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎన్నో ఏళ్ళుగా మండలంలోని కన్నాయిగూడెం, పేట మాలపల్లి లో రెవిన్యూ,అటవీ శాఖ మధ్య వివాదాస్పదంగా ఉన్న గిరిజన, దళితులు సాగు భూముల పరిష్కారం లభించిందని, ఇందులో అర్హులైన వారికి హక్కు పత్రాలు అందజేస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల,పేట మాల పల్లి లో 911,కన్నాయిగూడెం 152 నెంబర్ భూములను,గోగులపుడి కొండ రెడ్ల గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ భూములను సర్వే చేసామని త్వరలో హక్కు పత్రాలు అందజేస్తామని అన్నారు.కొండ రెడ్లు స్థానిక అటవీ వనరులను వినియోగించుకుని ఆర్ధిక సాధికారిత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
మీ భూములకు త్వరలోనే పట్టాలిస్తాం: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES