Thursday, May 22, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌కు అండ‌గా ఉంటాం: జపాన్

భారత్‌కు అండ‌గా ఉంటాం: జపాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఎంపి సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం గురువారం జ‌పాన్ రాజ‌ధాని టోక్యో చేరుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్త మద్దతు కోరుతూ ఒక బృందం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆదేశ విదేశాంగ మంత్రితో అఖిలపక్ష ప్రతినిధి బృందం భేటీ అయింది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా భార‌త్-జపాన్ బలమైన భాగస్వామ్యాన్ని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటాన్ని పునరుద్ఘాటించాయి. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న భార‌త్ ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆదేశ విదేశంగా మంత్రి చెప్పారు. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను అంత‌మొదించ‌డానికి త‌మ స‌హాయ స‌హాకారాలు ఇండియాకు అందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అంతకు ముందు టోక్యోలోని జాతిపిత మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి వ‌ద్ద‌ ఎంపీల బృందం పూల‌మాల‌తో నివాళ్లుర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -