Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమలావత్‌ పూర్ణకు అండగా ఉంటాం

మలావత్‌ పూర్ణకు అండగా ఉంటాం

- Advertisement -

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క
తండ్రిని కోల్పోయిన పూర్ణకు పరామర్శ


నవతెలంగాణ-సిరికొండ
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్‌ పూర్ణకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీ రాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మలావత్‌ పూర్ణ తండ్రి దేవదాస్‌ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డితో కలిసి మంత్రి సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో పూర్ణ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మాలావత్‌ పూర్ణ తండ్రిని కోల్పోవడం చాలా బాధాకర విషయమని, కొండంత ధైర్యంతో ఉండి ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు వచ్చే విధంగా చూస్తామని, త్వరలోనే పూర్ణను తీసుకెళ్లి సీఎంతో కల్పించి సమస్యలను వివరిస్తామని చెప్పారు. పాకాల గ్రామం నుంచి పందిమడుగు రోడ్డు వరకు బీటీ రోడ్డు కోసం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ ఈఈని ఆదేశించారు.

అటవీ ప్రాంతంలో రోడ్డు కోసం ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులతో మాట్లాడి అనుమతులను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. తుంపల్లి, పాకాల మధ్యలో గల హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణంతోపాటు రూరల్‌ నియోజకవర్గంలో వివిధ వంతెనల కోసం రూ.20కోట్లు మంజూరు చేయాలని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి మంత్రి సీతక్కను కోరారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ముప్పగంగారెడ్డి, ఐడీసీఎంఎస్‌ చైర్మెన్‌ తారాచంద్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎర్రన్న, చందర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు రవి, సొసైటీ చైర్మెన్‌ గంగాధర్‌, వైస్‌ చైర్మెన్‌ సాయిరి నర్సయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సంపత్‌రెడ్డి, పార్టీ నాయకులు ఉమ్మాజీ ప్రవీణ్‌, నరేష్‌, మాన్సింగ్‌ నాయక్‌, బాలరాజ్‌, నాయక్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -