– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి..
నవతెలంగాణ – తొగుట
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బెజ్జనమైన బిక్షపతి అకాల మరణం చెందడంతో అయన తండ్రి నర్సయ్య, భార్య రేణుక లను పరామర్శించి అండగా ఉంటామని మనోధైర్యం అందించారు. అలాగే తొగుట మండల కేంద్రానికి మాజీ ఎంపీటీసీ బ్రాహ్మన్ల యాదగిరి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేసి ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. పరామర్శించిన వారిలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పిట్ల వెంకటయ్య, బెజ్జనమైన బెజ్జనమైన శ్రీనివాస్, ఈదుగాళ్ళ పర్శరాములు, పిట్ల వెంకటేష్, పులి గారి లక్ష్మణ్, రమేష్, నరేష్, గణేష్, యాదగిరి, శంకర్, స్వామి, నాగరాజు తదితరులు ఉన్నారు.
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES