పలు కుటుంబాలను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే ..
నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దామ నడిపి గంగారం గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ నోముల మోహన్ రెడ్డి అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నల్లవెల్లి గ్రామానికి చెందిన బొల్లారం గంగారం అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా నిజామా బాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు ఉంటానని ఆయన అన్నారు. ఆయన వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం యూత్ నాయకులు నరేష్, రూరల్ నియోజవర్గం యూత్ అధ్యక్షులు తూంపల్లి మహేందర్, ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్లవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బాదిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES