• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ -పెద్దవంగర
కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన బానోత్ వనిత (22) ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మృతురాలి పార్థివదేహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సోమ నరసింహ రెడ్డి, సంజయ్ కుమార్, సర్పంచ్ బానోత్ యమున రాకేష్, ఉప సర్పంచ్ గోపాల్, వెంకట్రామయ్య, సీత్య నాయక్, గంగాధర్, రవి, సమ్మయ్య తదితరులు ఉన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


