Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ఆర్‌ బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్‌

త్రిబుల్‌ఆర్‌ బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్‌

- Advertisement -

– మాజీ మంత్రిని కలిసిన బాధితులు
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, నారాయణపురం మండ లాల్లో రీజినల్‌ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం త్రిబుల్‌ఆర్‌ బాధితులు డబ్బేటి రాములుగౌడ్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలిశారు. భూములు కోల్పోతున్న తీరును కేటీఆర్‌కు వివరించారు. గత అలైన్‌మెంట్‌ ప్రకారం ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 40 కిలోమీటర్ల నుంచి ఉండగా.. కొంతమంది వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో 28 కిలోమీటర్లకు అలైన్‌మెంట్‌ను తగ్గించారని వివరించారు. దీనిపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. బడా పారిశ్రామికవేత్తల కోసం భూములు లాక్కుని సీఎం రేవంత్‌రెడ్డి రైతులను బలి చేస్తున్నారని, త్రిబుల్‌ఆర్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బాధితుల వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కార్పొరేషన్స్‌ మాజీ చైర్మెన్లు పల్లె రవికుమార్‌గౌడ్‌, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, సర్పంచుల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -