కా.అక్కల బాపు యాదవ్..
నవతెలంగాణ – మల్హర్ రావు : దొడ్డి కొమురయ్య ఆశయ సాధనలో,శ్రామిక వర్గ విప్లవ పోరాటాలను బలోపేతం చేస్తామని కా. భారత ఐక్య యువజన సమాఖ్య(యువైఏప్ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కాటారం మండల కేంద్రములో తెలంగాణ రైతాంగ పోరాటములో తొలి అమర వీరుడు కా.దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభను నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాల చేసి విప్లవ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు భూమి కోసం,భుక్తి కోసం,శ్రామిక వర్గ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ తన గుండాలచే కడవెండి గ్రామంలో ప్రదర్శనగా వెళుతున్న రైతులు, కూలీలపై తుపాకీతో ఆ ప్రదర్శన చేసే వారిపై గుల్ల వర్షం కురిపించిన ఘటనలో ముందు వరసలో ఉన్నది కా.దొడ్డి కొమురయ్యని తెలిపారు. జూలై 4 1946 న ఆ తుపాకీ గుండులకు బలైన ఆయన వీర మరణం పొందారని తెలిపారు. ఆ రోజు మొదలైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటములో సుమారు 4వేల మంది అమరులైనట్లుగా తెలిపారు. 4 వేల గ్రామాలు దేశ ముకుల నుండి విముక్తి అయినాయని, సుమారు 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, దున్నే వాడికి భూమి కోసం పోరాటాలు కొనసాగాయని తెలిపారు.
ఆ విప్లవ స్ఫూర్తితో నేటి యువత ఈనాడు ఉద్యోగ,ఉపాధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.కేంద్రంలో బీజేపీని ప్రభుత్వం ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. అంబాని, ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు, కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వెస్తూరన్నారని, నేటి యువత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం పోరాటాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంతెనటోనీ, మురళి, సారయ్య, లింగయ్య, మల్లేష్ పాల్గొన్నారు.