కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
ఖర్గే మీటింగ్ కు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్..కార్యక్రమంలో భాగంగా ఛలో హైదరాబాద్ కు తరలివెళ్లిన వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల నుంచి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,మాజీ ఎంపిపిలు చింతలపల్లి మలహల్ రావు, ఐస్నపు రవి, సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్, మత్స్య శాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి సవేందర్, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, డివిజన్ యూత్ నాయకుడు రాహుల్, కేశారపు చెంద్రయ్య, జంగిడి సమ్మయ్య, జక్కుల వెంకటస్వామి, జగన్ నాయక్, భోగే మల్లయ్య, చిగురు సది, అజ్మీరా రాజు నాయక్, దొగ్గేల సంపత్, మావురపు వెంకన్న, పాల్గొన్నారు.