- – వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
నవతెలంగాణ – జన్నారం: కురుస్తున్న అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వరద బాధితులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు.కుండపోత వానలతో అతలాకుతలమైన మండలంలో ఆదివారం ఆమె పర్యటించారు.తిమ్మాపూర్, గ్రామంలో యువరైతు దాసరి వెంకటేష్ కు సంబంధించిన 6 వరి పొలం రెండు ఎకరాల పత్తి గోదావరి వరదల్లో కొట్టుకుపోవడంతో రైతును పరామర్శించారు. రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.అనంతరం
రాంపూర్,తపాలాపూర్ గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు.నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.ఇంటింటికీ వెళ్లి బాధితులతో మాట్లాడారు.ప్రజలతో సమావేశామై వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు.వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు.
వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.సుగుణక్క వెంట నాయకులు గుగ్లావత్ రవి రేగుంట ప్రదీప్, చిందం చంద్రయ్య,,కోవా శాంతయ్య, కనక వెంకటేష్,గుండా లచ్చయ్య,కోవా భూమయ్య, శంకరయ్య, జాడి రాజన్న, గోలకొండ రాజన్న, దాసరి వెంకటేష్, చిందం ముత్తయ్య,తపలాపూర్ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ నర్సయ్య, మామిడి శ్రీనివాస్, సత్తయ్య, ఉప్పు సత్తయ్య, పద్మారావు, సురక్షన్ తదితరులు ఉన్నారు.