నవతెలంగాణ – మద్నూర్
ప్రజా అవసరాల కోసం ముఖ్యమైన గ్రామ అభివృద్ధి పనులు చేపట్టడానికి గ్రామ ప్రజలంతా సహకరించాలని గ్రామసభలు గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్ కోరారు. మద్నూర్ మండలంలోని హెచ్ కెలుర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ జి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ .. గ్రామంలో ప్రజల అవసరాలను బట్టి ముఖ్యమైన సమస్యలు ముందుగా పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనుల కోసం గ్రామసభ తీర్మానించారు. ఈ గ్రామ సభలో గ్రామ ఉప సర్పంచ్ యశోద, కార్యదర్శి షిండే విజయ్ కుమార్, అంగన్వాడి సూపర్వైజర్ కవిత, ఐకెపి ట్రాన్స్కో సిబ్బంది అంగన్వాడీ టీచర్లు తదితర అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రజా అవసరాలను బట్టి గ్రామాభివృద్ధి పనులు చేపడతాం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



