కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం..
మాల మహానాడు ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయం ముందు నిరసన
నవతెలంగాణ – మణుగూరు
మాలల సమస్యలపై అలుపెరగని పోరాటాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతామని పినపాక నియోజకవర్గం మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం క్యాంపు కార్యాలయాన్ని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పినపాక నియోజకవర్గం ఇన్ చార్జి వెన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పిలుపుమేరకు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గ ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.
వర్గీకరణ చేసి మాలలకు తీరని అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మాలలు అలుపెరగకుండా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 99 జీఓ సవరించే వరకు రోస్టర్ పాయింట్లు 22 నుండి 16 కు తగ్గించే వరకు మాలలు అంత ఐక్యంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు మాల మహానాడు మండల అధ్యక్షుడు మణికుమార్, మాజీ ఎంపీటీసీ మేకల రవి, గుంటక ఏసోబు, డేగల సంపత్ కుమార్, డేగల సంసోన్, అశ్వాపురం మండలం మాల మహానాడు నాయకులు చల్లా రాజేష్, జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్, కళ్యాణపురం మాజీఉప సర్పంచ్ మేకల లక్ష్మణరావు, పిట్ట శ్రావణ్ మాల మహానాడు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.
అలుపెరగని పోరాటం నిర్వహిస్తాం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES