Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
నవతెలంగాణ – భూపాలపల్లి

భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  అన్నారు. శుక్రవారం  భూపాలపల్లి మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాలల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో రూ.10 లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం  రూ.50 లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదాల మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు, ఆర్టిఏ సభ్యులు సుంకరి రామచంద్రయ్య,ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -