నీలకంఠేశ్వర ఆలయ చైర్మన్ తిరుపతి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో ప్రఖ్యాతి గాంచిన నీలకంటేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ తిరుపతి తెలిపారు. ఈ మేరకు సోమవారం నూతన అభివృద్ధి కమిటీని సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా శంకర్ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని, సేవాభావంతో ఎల్లప్పుడూ అహర్నిశలు పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవీందర్, అర్చకులు, కమిటీ డైరెక్టర్లు నందకిషోర్, మదన్మోహన్, వెంకట్రెడ్డి, కాటిపల్లి రాజు, నాగనాథరావు, శ్రీనివాస్ గౌడ్,విజయరాణి, సత్యనారాయణ, క్రాంతి కిరణ్, చంద్రకాంత్, నాగారావు, నర్సింగరావును, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES