ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు టౌను
మేం పదవిలో ఉన్నా.. లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తామని, మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ , గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం బీసీ కాలనీలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి స్థానిక నాయకులు చింతకింది రేణుక ఆర్ విక్రమ్, ఆంజనేయులు, రాములు, మరికొందరు నాయకులతో కలిసి దాదాపు 150 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గొంగిడి సునీత మహేందర్రెడ్డి దంపతులు పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశామాని, అభివృద్ధి పనులు చేశామాని చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడగానే, గోదావరి జలాలు తీసుకువచ్చి నీటి ఎద్దడిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పారద్రోలారని చెప్పారు.
ఆలేర్ పట్టణం నియోజకవర్గానికి గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఆలేరు పట్టణంలో రూ.20 కోట్లనిధులతో రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టామన్నారు.
రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కొరకు రూ.6 కోట్ల నిధులు తెచ్చామని, ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇచ్చామని వివరించారు. డిగ్రీ కాలేజ్ , మైనార్టీ స్కూల్, కాలేజ్ , గోదాముల నిర్మాణం, ఒక కోటి రూపాయలతో ఎంపీడీవో కార్యాలయ నిర్మాణం, మిషన్ భగీరథ మంచినీరు పంపిణీ, సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు.
పట్టణంలో మున్సిపల్ నూతన భవనం కొరకు నిధులు కేటాయించామని, మున్సిపల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించి, పూర్తి చేయాలన్నారు. పేదలకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ ద్వారా రూ.1 లక్ష, 116లు ఇచ్చిన ఘనత కేసిఆర్ కి చెందుతుందన్నారు. గర్భవతుల కొరకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13000 వేలు, కేసీఆర్ కిట్టు అందజేశామన్నారు. షాది ఖానా,మజీద్ కమిటీల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు.
ఇమామ్లకు నిధులు కేటాయించామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగం పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ పాలనలో పనులు నిలిపివేశారన్నారు. విద్యార్థులకు స్కూటీ లేవని, మహిళలకు ఫిన్షన్లో లేవని ప్రశ్నించారు. మహిళలకు పెన్షన్ల రూపంలో ఒక్కో మహిళకు రూ.50 వేలబకాయి పడ్డారని, కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలన వచ్చాక, నూతన పెన్షన్లు లేవని, వ్యాపారాలు రియల్ ఎస్టేట్ మూతపడ్డాయని, పేద ప్రజలకు ఆర్థికంగా లోటు వచ్చిందని చెప్పారు. సింగరేణిలో లక్షల కోట్ల రూపాయల స్కాం జరిగిందని, ఢిల్లీకి డబ్బుల సూట్ కేసులు వెళ్తున్నాయని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కారు గుర్తుకు ఓటు వేయాలని పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో వస్పరి శంకరయ్య, బోట్ల పరమేశ్వర్, కొలుపుల హరినాథ్, పోరెడ్డి శ్రీనివాస్, మొరిగాడి వెంకటేష్, కుండే సంపత్, ఆడేపు బాలస్వామి, బేతి రాములు, జూకంటి ఉప్పలయ్య, కాసగళ్ల అనసూయ, టంగుటూరి సర్పంచ్ జూకoటి అనిల్, జల్లి నరసింహులు, కె రామచంద్రారెడ్డి, గిరి రాజు వెంకటయ్య, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, దయ్యాల సంపత్, సీసా మహేశ్వరి, మొరిగాడి ఇందిరా వెంకటేష్, బింగి రవి లత, మోర్తాల సునీత రమణారెడ్డి, జూకంటి పెద్ద ఉప్పలయ్య, సీస సత్తయ్య, ఎండి మదర్, హరికృష్ణ, బాలరాజు, భరత్ ,ప్రశాంత్, చింటూ పార్టీ సభ్యులు మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



