Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం 

గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం 

- Advertisement -

జప్తి వీరప్ప గూడెం సర్పంచ్ అందుగుల వెంకటయ్య 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్పగూడెం సర్పంచ్ అందుగుల వెంకటయ్య ఉప సర్పంచ్ పేలపోలు శ్రీనివాస్ అన్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. గ్రామంలో  మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమం అభివృద్ధి పై దృష్టి పెడతామని చెప్పారు. తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -