Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -

19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి 
నవతెలంగాణ కంఠేశ్వర్ 

తనను 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని, 19వ డివిజన్ పరిధిలో గల పలు కాలనీలలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం 19వ డివిజన్ పరిధిలో తన భర్త నరేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ అపార్టుమెంట్లలోకి వెళ్లి తనకు ఓటువేయాలని కోరారు. అపార్ట్మెంట్ వాసులను  కలిసి బొట్టు పెట్టి ఓటువేయాలని కోరారు. కాలనీల్లోకి వెళ్లి స్థాని కులతో మాట్లాడారు. చేతిపంపు వద్ద నీటికోసం వచ్చిన వారితో శమంత రెడ్డి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటికి తాగునీ టి కనెక్షన్లు ఇప్పిస్తానని, కాలనీల్లో అంతర్గతరోడ్లకు మరమ్మతులు చేయిస్తానని హామీ  ఇస్తూ ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో అవసరమైన చోట సీసీ డ్రైనేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు వేయించి మురుగునీటి సమస్య లేకుండా చూస్తానని తెలిపారు.  19వ డివిజన్ పరిధిలో అద్దె ఇండ్లలో నివసిస్తున్నవారికి అర్హులైన ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూస్తానని తెలిపారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్లు వచ్చేలా చూస్తానని హామీఇచ్చారు. తనకు అండగా ఉండి తనను  ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని శమంత నరేందర్రెడ్డి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -