ఫాస్ట్ అండ్ క్యూరియస్ ఆటో ఎక్స్‌పో – 2025 ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ – ఆటో ఎక్స్‌పో 2025 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను చిరునవ్వుతోనే స్వీకరించాలని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని ఆయన తెలిపారు. దీనితో పాటు పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమా ఛాన్స్‌ల కోసం తనెంత కష్టపడిన తీరు, సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత కూడా కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి ఎదుర్కొన్న అనేక సవాళ్లను అభిమానులతో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ గైడెన్స్ గురించి మాట్లాడుతూ యాక్టింగ్ ట్రైనింగ్‌తో పాటు జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ వంటి వాటిల్లో అందించిన సహకారం వంటి అనేక అంశాలు ప్రస్తావించారు.
ప్రతి సందర్భాన్ని సానుకూల భావనతోనే చూడాలని సీరియస్‌గా తీసుకోలేనని చెప్పారు. అతి వేగం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ఎంతటి ప్రమాదాల్ని సృష్టిస్తాయో ఉదహరిస్తూ ఆయనకు జరిగిన యాక్సిడెంట్, కోమా వంటి అంశాలతో పాటు, డిశ్చార్జి అయ్యాక మాట సరిగా రాక పడిన ఇబ్బందులను సైతం పంచుకున్నారు. ఆ పరిస్థితిని నుంచి కోలుకోవడానికి ఎంతటి కష్టం పడాల్సి వచ్చిందో కూడా వివరించారు. సినిమాల గురించి మాట్లాడుతూ ‘రిపబ్లిక్’ మూవీ లాంటి కథలు వస్తే మళ్లీ చేస్తానన్నారు. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ చేయడం మన బాధ్యత అన్నారు. చిరంజీవితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరికను వెలిబుచ్చారు. తనకు ఇష్టమైన కార్ల గురించి చెప్పడంతో, తన డ్రీమ్ కారు 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ గురించి కూడా అనేక విషయాలు ఆసక్తిగా పంచుకున్నారు.
హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES