Tuesday, October 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పోచమ్మ దీక్ష మాల ధారణ..

పోచమ్మ దీక్ష మాల ధారణ..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ నూతన ఆలయ, విగ్రహ  ప్రతిష్టాపన నవంబర్ 7 శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్ ,ఈ ఓ భూమయ్య తెలిపారు. ఈ సందర్బంగా వేదపండితులు  చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో ఆలయంలో మంగళవారం భక్తులు  దేవి దీక్ష మాలను స్వీకరించారు. ఆసక్తి గల భక్తులు రేపు బుధవారం కూడా దీక్షను తీసుకోవచ్చని వెల్లడించారు. నవంబర్ 3 సోమవారం నుండి 7 శుక్రవారం వరకు సహస్ర కలశాభిషేకం, శత చండీ యాగం,విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవం జరుగును కావున అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -