– కుమార్తె అప్పగింతల సమయంలో గుండెపోటుతో తల్లి మృతి
నవతెలంగాణ – కామేపల్లి
అప్పటి వరకు పచ్చని పెండ్లి పందిరిలో కుటుంబీకులు, బంధుమిత్రులతో సంతోషంగా సాగిన ఇంట్లో అకస్మాత్తుగా తీరని విషాద ఘటన చోటుచేసుకుంది. కుమార్తె అప్పగింతల సమయంతో భావోద్వేగానికి గురైన తల్లి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాస్‌పురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్ కళ్యాణి(40), మోహిలాల్ దంపతుల పెద్ద కుమార్తె సింధు వివాహం ఆదివారం జరిగింది. వివాహం అనంతరం అత్తగారింటికి పంపించే అప్పగింతల సమయంలో కుమార్తెను తల్లి బానోతు కళ్యాణి ఆలింగం చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ వెంటనే కుప్పకూలింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే కళ్యాణిని ముచ్చర్ల గ్రామీణ వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కళ్యాణి మృతదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
పెండ్లింట విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES