Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంబాల్యంలోనే బరువు బాధ్యతలు

బాల్యంలోనే బరువు బాధ్యతలు

- Advertisement -

– బాల్యవివాహాలతో ఆడుకునే వయస్సులో అమ్మలుగా మారుతున్న వైనం
– మోడీ సొంత రాష్ట్రంలో మైనర్ల దుస్థితి
– పేరుకే…బేటీ బచావో.. బేటీ పడావో


అహ్మదాబాద్‌: బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ప్రధాని మోడీ నినాదం.. ఆయన సొంత రాష్ట్రంలో మచ్చుకైనా కనిపిం చటం లేదు. అందుకు తాజా ఉదాహరణే గుజరాత్‌లో బాల్య వివాహాలతో చిన్నారులు ఆడుకునే వయస్సులో అమ్మలుగా మారుతున్నారు. బాల్యవివాహల చట్టం అమలులో ఉన్నా.. అవేవీ పట్టించుకోక పోవడంతో ఏవిూ తెలియని వయస్సులో వారు బరువూ బాధ్యతలను నెత్తినెత్తుకుం టున్నారు. ఇటీవల గుజరాత్‌ ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సర్వేలో ఏమున్నది..?
బాల్యవివాహాలతో గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య 13 నుంచి 17 ఏండ్ల వయస్సు గల చిన్నారులు గర్భవతులైనట్టు గుజరాత్‌ ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ప్రసూతి ఆరోగ్య డేటాను సంకలనం చేస్తున్నప్పుడు చిన్నారులు గర్భం ధరించడం, మరికొందరు తల్లులుగా మారిన తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

”ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ 2025 మధ్య 22,812 మంది స్త్రీలు గర్భిణీలుగా నమోదు చేయబడ్డారు. వారిలో 14 ఏండ్ల వయస్సు గల బాలికలు ఇద్దరు, 15 ఏండ్ల వయస్సు బాలికలు 34 మంది, 16 ఏండ్ల వయస్సు గల వారు 76 మంది, 17 ఏండ్ల వయస్సు గల వారు 229 మంది చిన్నారులున్నారు. వీరంతా గర్భం దాల్చినట్టు ఇన్‌చార్జి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఘనశ్యామ్‌ గధ్వి తెలిపారు. ఇది ఆందోళ నకరమైన సంఖ్యగా వివరించారు. ఇందులో 88 మంది గర్భిణీ మైనర్లతో కడి అగ్రస్థానంలో ఉంది. మెహసానా తాలూకా తర్వాతి స్థానంలో ఉంది.

కాగితాలపైనే..
గుజరాత్‌లో బాల్య వివాహ నిషేధ చట్టం అమలులో ఉంది. ఈ వివాహాలను నిరోధించే బాధ్యత ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌పై ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే..ఈ చట్టం అపహాస్యం పాలైనట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ప్రసూతి ఆరోగ్య డేటాను పర్యవేక్షి స్తున్నప్పటికీ.. నివారణ యంత్రాంగం పనిచేయడం లేదని మెహ్సానా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ఆరోగ్యపరంగా చూస్తే తీవ్రమైనవి. అంతేకాదు ప్రాణాంతకమైనవి. ప్రారంభ దశలోనే గర్భాలు దాల్చిన తల్లి , బిడ్డ ఇద్దరినీ తీవ్రమైన ఆరోగ్య ప్రమాదంలో పడేస్తాయన్న వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. మహమ్మారి లాక్‌డౌన్‌ తర్వాత.. మెహ్సానాలో శిశు, ప్రసూతి మరణాల రేట్లు పెరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. తక్కువ వయ స్సుతో గర్భధారణలు పెరగటంతో బాలికల తల్లి దండ్రుల్లోనూ భయాందోళనలు వ్యక్తమ వుతున్నాయి. రాష్ట్ర అక్షరాస్యత, పరిపాలనా బలానికి ప్రతీక అయిన మెహసానాలో ఇలాంటి మైనర్ల గర్భధారణ సంక్షోభం బయటపడుతుండటంపై మహిళా సం ఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. గుజరాత్‌లోని గిరిజన, మారు మూల లేదా పర్యవేక్షణ లేని జిల్లాల్లో ఏ భయానక పరిస్థితులు దాగి ఉన్నాయని, గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -